‘మీరు వాడి పారేసిన మాస్కులు ఒక తిమింగలాన్ని చంపేయవచ్చు’

ప్రచురణ

ఒకవైపు ప్రపంచం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతోంది. మరోవైపు ఆ పోరాటానికి ఉపయోగిస్తున్న మాస్కులు, గ్లవ్స్, పీపీఈ కిట్లు వంటివి సముద్రాల్లోకి వస్తున్నాయి.

ప్రతి నెలా 12900 కోట్ల ఫేస్ మాస్కులను, 6500 కోట్ల ప్లాస్టిక్ గ్లవ్స్‌ను వాతావరణంలోకి తీసుకొస్తున్నామని ఓషియన్ కన్జర్వెన్సీ చెబుతోంది.

వాడిపారేసిన ఈ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యావరణ పరిరక్షకులు, పర్యవేక్షకులు సముద్ర మట్టంలో కనుగొని, బయటకు తీస్తున్నారు.

వీటిని ఇలాగే వదిలేస్తే సముద్రంలోని జీవ జాతులకు ఇబ్బందులు తప్పవని, వీటి వల్ల అవి ప్రమాదంలో పడొచ్చని వారు చెబుతున్నారు.

పై వీడియోలో మరిన్ని వివరాలు చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)