లాక్‌డౌన్‌లో ఉద్యోగులకు అండగా నిలిచిన మహిళా వ్యాపారి

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్‌లో ఉద్యోగులకు అండగా నిలిచిన మహిళా వ్యాపారి
ప్రచురణ

లాక్డౌన్లో పేదలు, కార్మికులు పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేం. ఉద్యోగాలు పోయి.. ఉపాధి దొరక్క పస్తులున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

కానీ లాక్‌డౌన్ లాంటి కష్ట సమయంలోనూ సొంతగా తన కాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా.. నలుగురికి ఉపాధి కల్పించారు బిహార్‌కు చెందిన మనోరమా సింగ్.

వైశాలి ప్రాంతంలోని లాల్గంజ్ గ్రామంలో పుట్టగొడుగుల సాగు చేస్తూ ఆమె ఏడాదికి కోటి రూపాయలకు పైగా వ్యాపారం చేస్తున్నారు.

సుమారు పదేళ్ల క్రితం ఒక గుడిసెలో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టిన మనోరమ ఎలా అంచలంచెలుగా ఎదిగారు.. ఎలా పది మందికి ఉపాధి చూపారో బీబీసీ ప్రతినిధి వికాస్ కుమార్ అందిస్తున్న ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)