రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడటం ఆపేయాలి.. మగవాళ్లకు లేనప్పుడు మహిళలకు ఎందుకు?’

ప్రచురణ

‘‘జీవితంలో చిన్నచిన్న సంఘటనలే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆయా సంఘటనలను మనం సంపూర్ణంగా జీవించాలి’’ అంటున్నారు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్.

బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మనకు ఇల్లు ఉంది. మంచి ఆరోగ్యం ఉంది. మనకు ఉన్నదాని పట్ల మనం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. కృతజ్ఞతతో ఉండాలి. మనకు వీలైనంతలో లేనివాళ్లకు సాయం చేయాలి’’ అని ఆమె అన్నారు.

సరిహద్దుల్లో సైన్యం మనకోసం యుద్ధం చేస్తోందని, అలాంటిది ప్రజలంతా ఏసీలో కూర్చుని, ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కరోనావైరస్‌తో యుద్ధం చేయడానికి ఎలాంటి సమస్యా ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘ఫిట్‌నెస్ అంటే మనం ఎలా కనిపిస్తున్నాం అని కాదు.. మనల్ని మనం ఎలా ఫీల్ అవుతున్నాం అని. నేను చెమట చిందించకపోతే మంచిగా ఉండలేను’’ అని తన ఫిట్‌నెస్ గురించి తెలిపారు.

‘దాని గురించి మాట్లాడటం ఆపేయాలి’

మహిళా సాధికారత గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘‘మహిళా సాధికారత అనేది మహిళల నుంచే ప్రారంభం కావాలి. మనం ఎవరితో పోల్చినా తక్కువ కాదు అని విశ్వసించాలి. ఇప్పుడు దీని గురించి అంతా మాట్లాడటం మంచి విషయం. మహిళా దినోత్సవం లాగా పురుషుల దినోత్సవం ఉందా? లేదు కదా.. అలాంటప్పుడు మహిళల దినోత్సవం ఎందుకు జరపాలి? అలా మనకు మనమే (మహిళలు) బలహీనులమని చెప్పుకుంటున్నాం. పురుష సాధిరాకత గురించి మనం మాట్లాడుకోం. మహిళా సమానత్వం సాధించడానికి చాలా సమయం పడుతుంది. ప్రతి మహిళ తనను తాను విశ్వసించినప్పుడు, తనపై తాను నమ్మకం పెంచుకున్నప్పుడు, తన హక్కుల కోసం నిలబడ్డప్పుడు, తన కలలను సాధించుకోవడం ప్రారంభించినప్పుడు, పురుషులంతా తమతమ మహిళలకు మద్దతు ఇచ్చినప్పుడు సమాజం మారుతుంది.’’

కరోనావైరస్ లాక్‌డౌన్ జీవితం గురించి రకుల్ ప్రీత్ ఏమంటున్నారు? లాక్‌డౌన్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? లాక్ డౌన్ సమయంలో దాదాపు 300 కుటుంబాల ప్రజలకు ఆహారం అందించాలని నిర్ణయించుకోవడానికి ముందు ఆమె ఆలోచనలు ఏంటి? ఫిట్‌నెస్‌ను ఇష్టపడే ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు? దక్షిణాది సినిమా పరిశ్రమలకు, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పని విధానంలో ఉన్న తేడాలేంటి? సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆమె ఏమన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)