బీపీఆర్ విఠల్ కన్నుమూత: ‘తెలంగాణ అస్తిత్వంపై అనుమానాలను పటాపంచలు చేసిన ఆర్థికవేత్త’

బీపీఆర్ విఠల్

ఫొటో సోర్స్, CRamachandraiah/FB

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు.

విఠల్ తొలి తరం ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వర్తించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1972 నుంచి 1982 వరకూ ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా పనిచేశారు.

ఏపీ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా, పదో ఆర్థిక సంఘం సభ్యుడిగానూ ఆయన సేవలు అందించారు. కేరళ ప్రభుత్వం ఎక్స్‌పెండిచర్ కమిషన్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తరఫున సూడాన్, మాలావీ ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుగానూ కొంత కాలం పనిచేశారు.

హైదరాబాద్‌లోని మదర్సా-ఎ-అలియాయ్, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌ల్లో విఠల్ విద్యాభ్యాసం సాగింది.

1942లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువును మధ్యలో వదిలేసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరారు. జాతీయోద్యమంలో పనిచేశారు.

అయితే, గాంధీజీ సలహా మేరకు తిరిగి మద్రాస్‌ క్రిస్టియన్ కాలేజీ (ఎమ్‌సీసీ)లో చదువుకున్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్‌సీసీ విద్యార్థి సంఘం తొలి భారతీయ అధ్యక్షుడు ఆయనే.

1949లో హైదరాబాద్ సివిల్ సర్వీసులో చేరిన విఠల్... ఆ మరుసటి ఏడాది ఐఏఎస్‌కు అర్హత సాధించారు.

‘ద తెలంగాణ సర్‌ప్లసెస్’

విఠల్ అనేక రచనలు చేశారు. ఆయన రాసిన ‘ద తెలంగాణ సర్‌ప్లసెస్: ఎ కేస్ స్టడీ’ పుస్తకం ప్రత్యేక తెలంగాణ డిమాండు బలపడేందుకు దోహదపడింది.

హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌ (సీఈఎస్ఎస్) సంస్థను విఠల్‌ స్థాపించారు.

1960లో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేశారు.

పదవీవిరమణ తర్వాత వివిధ సామాజిక ఉద్యమాలు, నిజామ్స్ ట్రస్ట్, హైదరాబాద్ లిటరరీ సొసైటీ, జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలతో కలిసి ఆయన పనిచేశారు.

విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్, కుమారులు సంజయ్ బారు, చైతన్య బారు ఉన్నారు.

సంజయ్ బారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు మీడియా సలహాదారుగా సంజయ్ పనిచేశారు.

బీపీఆర్ విఠల్‌తో కేటీఆర్

ఫొటో సోర్స్, KTR/Twitter

ప్రముఖుల సంతాపం

విఠల్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

తొలితరం సివిల్ సర్వీసెస్ అధికారిగా విఠల్ చేసిన కృషి, వారి జీవితం ఎందరో ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విఠల్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అస్తిత్వం గురించి వ్యక్తమైన అనుమానాలన్నింటినీ విఠల్ రాసిన ‘తెలంగాణ సర్‌ప్లసెస్’ పుస్తకం పటాపంచలు చేసిందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బీపీఆర్ విఠల్‌ను తాను ఇదివరకు కలిసినప్పటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ, కేటీఆర్ నివాళులు అర్పించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఎంతోమంది సీఎంలకు, విధాన రూపకర్తలకు విఠల్ మార్గదర్శకుడని రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ కొనియాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)