'కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే' నినాదాలతో మార్మోగిన సూర్యాపేట

ప్రచురణ

భారత-చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో మృతిచెందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి సూర్యాపేట జిల్లాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

స్వగ్రామం కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి నివాళులర్పించారు.

సంతోష్‌ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. 'సంతోష్‌ బాబు అమర్‌ రహే' అంటూ నివాదాలు చేశారు.

సంతోష్ బాబు అంతిమయాత్ర సమయంలో స్థానికులు భవనాల పైనుంచి పూలు చల్లుతూ నివాళులు అర్పించారు.

అంతిమయాత్రలో జనం భారీగా పాల్గొన్నప్పటికీ, కరోనా వల్ల అంత్యక్రియలకు కొందరినే అనుమతించారు.

సంతోష్ పార్థివదేహాన్ని16 బిహార్ ఆర్మీ రెజిమెంట్ అధికారులు చితివరకూ తీసుకువచ్చారు. అనంతరం గాల్లోకి మూడుసార్లు తుపాకీ పేల్చి గన్ సెల్యూట్ సమర్పించారు.

తర్వాత సంతోష్‌బాబు భార్య, పిల్లలు, బంధువులు, అంత్యక్రియలకు హాజరైనవారందరూ పార్థివదేహానికి సెల్యూట్ చేశారు.

సంతోష్ బాబు చితికి ఆయన తండ్రి ఉపేందర్‌ నిప్పుపెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి.

సంతోష్ బాబు మృతికి సంతాపంగా సూర్యాపేటలో వ్యాపారులు అందరూ స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును

,

,

‌లో ఫాలో అవ్వండి.

లో సబ్‌స్క్రైబ్ చేయండి.)