ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అంబులెన్సులోనే కన్నుమూసిన గర్భిణి

వీడియో క్యాప్షన్, ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అంబులెన్సులోనే కన్నుమూసిన గర్భిణి
ప్రచురణ

దిల్లీలో జులై చివరి నాటికి కరోనా కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటుతుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కోవిడ్-19 కేసుల విషయంలో వైరస్ పుట్టిన వూహాన్‌ను దాటేసింది ముంబయి.

అయితే మరోవైపు వివిధ రకాల అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులు వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు. గంటల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా బెడ్స్ ఖాళీ లేవంటూ తమను వెనక్కి పంపుతున్నారని ఎందరో పేషెంట్లు, వారి బంధువులు చెబుతున్నారు.

తన మేనకోడలికి చికిత్స కోసం ఒక మాజీ ఎంపీ సైతం ట్విటర్‌ ద్వారా‌ విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది.

నీలిమా సింగ్ ఎనిమిది నెలల గర్భిణి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో నీలిమను తీసుకొని ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కరోనా పేషెంట్లతో బిజీగా ఉన్నామనే సమాధానమే వచ్చింది. చివరకు అంబులెన్స్‌లోనే ఆమె కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)