You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బుల్లితెర నుంచి వెండితెర వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రస్థానం
ధోనీ జీవితచరిత్రలో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించిన ముంబయి పోలీసులు ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.సూసైడ్ నోట్ వంటిదేమీ దొరకలేదని ముంబయి పోలీసుల అధికార ప్రతినిధి డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు.
కాగా సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన ఇంట్లో పనిచేసేవారు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
టీవీ నటుడిగా మొదలైన ప్రస్థానం
సుశాంత్ సింగ్ బిహార్‌లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు.
కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో అతని నటనా జీవితం ప్రారంభమైంది.జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్‌తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.తర్వాత సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షీ లాంటి సినిమాలు చేశారు.
అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పీకేలోనూ సుశాంత్‌ది కీలక పాత్ర ఉంది.
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ''ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'' సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.కేదార్‌నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు.
జర్నలిస్ట్ మధు పాల్ వివరాల ప్రకారం బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నౌకరు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు.టీవీ నటుడుగా కెరియర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)