విశాఖ గ్యాస్ లీక్: ‘ఇక్కడి పంటలు తినొద్దు, అమ్మొద్దు అంటున్నారు’

ప్రచురణ

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

దాదాపు 1,400 ఎకరాల్లో పంటలు పనికిరాకుండా పోయాయి.

విశాఖ నగరానికి ఇక్కడి నుంచి ఆకుకూరలు, కూరగాయల సరఫరా ఆగిపోయింది.

గ్యాస్ లీక్ కారణంగా 5 కిలోమీటర్ల పరిధిలో పండే కూరగాయలను, చేపలను తినొద్దని ప్రభుత్వం చెప్పింది.

ఆకు కూరలను, కూరగాయలను రైతులు అమ్మొద్దని అధికారులు ఆదేశించారు.

గ్యాస్ లీక్ వల్ల వ్యవసాయం పూర్తిగా పోయిందని.. పండిన కూరగాయలను ఎవ్వరూ కొనటం లేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు.

''కరోనా ప్రభావం అసలే ధరలు లేవు అనుకుంటే ఇప్పుడు ఇదొకటి... ఇప్పుడు ప్రభుత్వం ఏం చెస్తుందో చూడాలి'' అంటూ నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. కనీసం విత్తనాల కైనా ప్రభుత్వం సాయం చేస్తే మళ్లీ వ్యవసాయం చెస్తామని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)