You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్ డౌన్ రాహుల్ గాంధీ వర్సెస్ ప్రకాశ్ జవడేకర్
‘‘21 రోజుల్లో కరోనావైరస్‌పై పోరాటంలో గెలుస్తామని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు లాక్‌డౌన్‌లు అయ్యాయి. దాదాపు 60 రోజులు గడిచాయి. వ్యాధి పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ను తీసివేస్తున్న మొదటి దేశం భారతే. జపాన్, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్... ఇలా ఏ దేశమైనా కేసులు పెరుగుతున్నప్పుడు లాక్‌డౌన్ విధించాయి. భారత్‌లో లాక్‌డౌన్ విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. నరేంద్ర మోదీ పెట్టుకున్న లక్ష్యం పూర్తవ్వలేదు. మేం గౌరవంగా, మర్యాదతో ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. మీ 'ప్లాన్ బీ' ఏంటి?’’ అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధానమిచ్చారు.
‘‘కాంగ్రెస్ ఇలాంటి సమయంలోనూ రాజకీయాలు చేయడం ఆపడం లేదు. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ దీనికి ఉదాహరణ. ఆయన చెప్పిన మాటలు కూడా తప్పులే. నేను ఆయనకు విడమర్చి చెప్పాలనుకుంటున్నా. లాక్‌డౌన్ విధించినప్పుడు కేసులు రెండింతలవ్వడానికి మూడు రోజుల సమయం పడుతూ ఉంది. ఇప్పుడు ఆ రేటు తగ్గి, ఆ వ్యవధి 13 రోజులకు పెరిగింది. ఇది భారత్ విజయం. అందరి విజయం. నాకు ఆశ్చర్యమేస్తోంది.లాక్‌డౌన్ విధించినప్పుడు కాంగ్రెస్ హంగామా చేసింది. 'లాక్‌డౌన్ ఎందుకు విధించారు? దేశవ్యాప్తంగా ఎందుకు విధించారు? ఆర్థికవ్యవస్థ నాశనమవుతుంది' అంటూ గోల పెట్టింది.విధించినప్పుడూ వ్యతిరేకించింది. ఇప్పుడు ఎత్తివేస్తున్నప్పుడూ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ది రెండు నాలుకల ధోరణి’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
- కరోనావైరస్: రోజూ నలుగురు వలస కార్మికులు చనిపోతున్నారు... లాక్డౌన్లో పెరుగుతున్న పేదల మరణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)