వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ

వీడియో క్యాప్షన్, వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
ప్రచురణ

ఐదేళ్లకే రెజ్లర్ శిక్షణ మొదలయ్యింది. రోజుకు ఐదారు గంటల సేపు సాధన. అప్పుడప్పుడే కెరియర్లో ఎదుగుతున్న దశలో తండ్రి మరణం జీవితాన్ని పాతాళంలోకి నెట్టేసింది. ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి చెయ్యకుండా మల్లయుద్ధాలేంటంటూ ఆమె తల్లికి ఊళ్లో వాళ్ల ఉచిత సలహాలు మొదలయ్యాయి.

వాటన్నింటినీ పక్కనపెట్టిన తల్లి... అన్నేళ్ల పాటు తన బిడ్డ పడ్డ శ్రమ వృథా కాకుడదని ధైర్యంగా అడుగు ముందుకేశారు. అనుకున్నట్టే ఆమె బిడ్డ ప్రయాణం ఒలింపిక్స్ వరకు వెళ్లేదే... కానీ అంతలోనే మోకాలి గాయం ఆశలపై నీళ్లు చల్లేసింది. అయినా సరే... పట్టు వీడలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. ఆ అడుగే... ఇప్పుడు మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనేంత వరకు తీసుకొచ్చింది.

కష్టాలు, కన్నీళ్లు, విజయాలు... ఇలా అన్నీ ఆమె జీవితంలో ఎదురయ్యాయి. అయినా వేటికీ వెరవలేదు. వెనకడుగు వెయ్యలేదు. ఆమే... ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ నామినీగా ఎంపికైనా ఆమెపై పూర్తి కథనాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

షూట్-ఎడిట్: ప్రేమ్ భూమినాథన్, నేహా శర్మ

రిపోర్టర్ & ప్రొడ్యూసర్: వందన

Presentational grey line
Presentational grey line
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)