కరోనావైరస్ నాకు సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి: చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి

ప్రచురణ

''మాకు కరోనా వైరస్ సోకిందనిగాని, లేదనిగాని చైనా వాళ్లు కచ్చితంగా చెప్పడంలేదు. మాకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. అలసట, భయం, ఒత్తిడి వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త పెరిగిందంతే. ఎలాంటి వైద్య పరీక్షలకైనా మేం సిద్ధం. మేం ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని తిరిగి భారత్‌కు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అంటూ కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

ఆమె స్వస్థలం కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం బిజినవేముల గ్రామం.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2019లో ఆమె బీటెక్ పూర్తిచేశారు. 2019 ఏప్రిల్లో ప్రాంగణ నియామకాల్లో టీసీఎల్‌లో ఉద్యోగం సంపాదించారు.

2019 ఆగస్టు చివరి వారంలో శిక్షణ నిమిత్తం జ్యోతి సహా కొందరు భారత ఉద్యోగులను ఆ సంస్థ చైనాలోని వుహాన్ నగరానికి తీసుకెళ్లినట్లు జ్యోతి తల్లి ప్రమీలా దేవి బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)