వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
ఐదేళ్లకే రెజ్లర్ శిక్షణ మొదలయ్యింది. రోజుకు ఐదారు గంటల సేపు సాధన. అప్పుడప్పుడే కెరియర్లో ఎదుగుతున్న దశలో తండ్రి మరణం జీవితాన్ని పాతాళంలోకి నెట్టేసింది. ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి చెయ్యకుండా మల్లయుద్ధాలేంటంటూ ఆమె తల్లికి ఊళ్లో వాళ్ల ఉచిత సలహాలు మొదలయ్యాయి.
వాటన్నింటినీ పక్కనపెట్టిన తల్లి... అన్నేళ్ల పాటు తన బిడ్డ పడ్డ శ్రమ వృథా కాకుడదని ధైర్యంగా అడుగు ముందుకేశారు. అనుకున్నట్టే ఆమె బిడ్డ ప్రయాణం ఒలింపిక్స్ వరకు వెళ్లేదే... కానీ అంతలోనే మోకాలి గాయం ఆశలపై నీళ్లు చల్లేసింది. అయినా సరే... పట్టు వీడలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. ఆ అడుగే... ఇప్పుడు మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనేంత వరకు తీసుకొచ్చింది.
కష్టాలు, కన్నీళ్లు, విజయాలు... ఇలా అన్నీ ఆమె జీవితంలో ఎదురయ్యాయి. అయినా వేటికీ వెరవలేదు. వెనకడుగు వెయ్యలేదు. ఆమే... ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీగా ఎంపికైనా ఆమెపై పూర్తి కథనాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
షూట్-ఎడిట్: ప్రేమ్ భూమినాథన్, నేహా శర్మ
రిపోర్టర్ & ప్రొడ్యూసర్: వందన

ఇవి కూడా చదవండి
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- వీడియో: హిజాబ్ ధరించి క్రికెట్ ఆడుతున్న అమ్మాయిలు
- గీతా చౌహాన్: ‘పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి’
- వీడియో: కరోనా వైరస్.. చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)