వీడియో: విశాఖపట్నం సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తున్న స్కూబా డైవర్లు
‘‘ఈ స్కూబా డైవర్లు రెండు వారాల్లోనే 4 వేల కిలోల ప్లాస్టిన్‌ను సముద్రం నుంచి వెలికి తీశారని తెలిసింది. చాలా చిన్నగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఉద్యమంగా మారుతోంది. వీళ్ల నుంచి మనం కూడా స్ఫూర్తి పొంది.. మన చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు నడుం బిగించాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది నవంబర్‌లో తన ‘మన్ కీ బాత్’లో విశాఖపట్నం స్కూబా డైవర్ల గురించి చెప్పారు.
దీంతో అందరి దృష్టీ ఈ స్కూబా డైవర్లపై పడింది.
స్వచ్ఛ భారత్ అంటూ చాలామంది వీధులు, వాడలు శుభ్రం చేస్తుంటే.. వీళ్లు సముద్రాన్ని కూడా శుభ్రం చేస్తున్నారు. అందుకే ప్రధాని మెప్పు పొందారు.


నిజానికి సముద్ర మట్టం వరకూ వెళ్లి ఈత కొట్టే ‘స్కూబా డైవింగ్’ నేర్పించేందుకు వీళ్లు విశాఖపట్నం బీచ్‌లో దిగారు. అక్కడ సముద్రంలో చెత్త కనిపించడంతో తాము ఈత కొట్టే ప్రాంతం వరకూ శుభ్రం చేద్దామని మొదలు పెట్టారు. ఇప్పుడు ప్లాస్టిక్ తీయడం కోసమైనా ఈతకొడుతున్నామని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఊబర్ 'ఈట్స్'.. జొమాటోకు విక్రయం
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్... నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)