వీడియో: ‘ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు, పాకిస్తాన్ గురించి ఆలోచించుకో’ - అసదుద్దీన్ ఒవైసీ
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.
భారతదేశ ముస్లింల గురించి ఆందోళన చెందడం ఆపేయాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి అసదుద్దీన్ అన్నారు. పాకిస్తాన్ జాతిపిత జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తుంటారని, బంగ్లాదేశ్ వీడియోలను చూపించి అది ఇండియా అంటుంటారని తప్పుపట్టారు.
‘మిస్టర్ ఖాన్.. నీ స్వదేశం గురించి ఆలోచించుకో. మమ్మల్ని అసలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవద్దు. మేం భారతీయ ముస్లింలుగా గర్విస్తున్నాం. మేం సగర్వ భారతీయ ముస్లింలుగానే ఉంటాం. మా పౌరసత్వాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆ హక్కును మాకు ఇచ్చింది’’ అని అసదుద్దీన్ అన్నారు.
కాగా, పాకిస్తాన్ పంజాబ్‌లో సిక్కు గురుద్వారాలపై దాడులు చేస్తున్న వారిని ఆపాలని, సిక్కులను గౌరవించడం నేర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌కు అసదుద్దీన్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- కాసిం సులేమానీ హత్య తర్వాత ఇరాన్, ఇరాక్‌లో ఏం జరుగుతోంది?
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా?
- 'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
- కాసిం సులేమానీని అమెరికా ఇప్పుడే ఎందుకు చంపింది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- పాకిస్తాన్‌లోని నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి.. సిక్కు ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్న భారత్
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- దిశ చట్టం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన ఈ అధికారులు ఎవరు?
- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, సీఎం, అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు
- మీ స్నేహితులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా?
- కాసిం సులేమానీ: ఇరాన్, అమెరికా ఉద్రిక్తలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)