కశ్మీర్: ‘సైన్యంపై వచ్చిన ఆరోపణల్లో 90 శాతం నిరాధారం’ - ఆర్మీ లెఫ్టినెంట్ మాజీ జనరల్
ఆర్మీ లెఫ్టినెంట్ మాజీ జనరల్ దీపేందర్ సింగ్ హుడా బీబీసీతో మాట్లాడుతూ కశ్మీర్‌లో సైన్యంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
‘‘ఆరోపణలు నిజమయితే అక్కడ జరిగింది కచ్చితంగా తప్పే. అందులో మరో మాట లేదు. కానీ ఇలా హింసకు పాల్పడటం భారత సైన్యానికి అలవాటని లేదా ఇటువంటి ఘటనలను అది పట్టించుకోదని చెప్పాలనుకోవడం మాత్రం సరికాదు’’ అని ఆయన అన్నారు.
‘‘నేను సైన్యంలో 40 ఏళ్లు పని చేశా. తిరుగుబాటు ఆపరేషన్లలో మానవ హక్కులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని స్పష్టం చేశారు.
‘‘మా దృష్టికి వచ్చే ప్రతి ఘటనా... అంటే అది అధికారికంగా కావొచ్చు లేదా మానవ హక్కుల సంఘాల ద్వారా కావొచ్చు లేదా అనధికారికంగా కావొచ్చు... ప్రతి దానిపైనా విచారణ జరుగుతుంది’’ అని వెల్లడించారు.
‘‘మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి శిక్షలు ఎదుర్కొన్న అనేక సైనికులున్నారు, అధికారులు కూడా ఉన్నారు. కానీ విచారణ తరువాత 90 శాతం ఆరోపణలకు ఎటువంటి రుజువులు లేవనే తేలింది’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- ఎన్ఆర్సీ: అస్సాంలో 19 లక్షల మంది భారతీయులు కాదు - కేంద్ర ప్రభుత్వం
- ట్విటర్ సీఈఓ అకౌంట్ హ్యాక్ చేసిన 'చక్లింగ్ స్క్వాడ్' హ్యాకర్లు
- ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)