వీడియో: కేరళ వరదలు.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
రిపోర్టర్: దీప్తి బత్తిని, షూట్ ఎడిట్: నవీన్ కుమార్ కె
బీబీసీ ప్రతినిధులు
భారీ వరదల విధ్వంసాన్ని చవిచూసి ఏడాది గడిచిందో లేదో, కేరళలో మళ్లీ జల ప్రళయం వచ్చింది. ఉత్తర కేరళ - కోజికోడ్, వాయనాడ్, మలప్పుఱం ప్రాంతాలు దారుణంగా వరదల బారిన పడ్డాయి. శనివారం సాయంత్రం నాటికి 57 మంది వరదల వల్ల మరణించగా, వారిలో 19 మంది మలప్పుఱం ప్రాంతానికి చెందినవారే.
జిల్లా కంట్రోల్ రూమ్ వివరాల ప్రకారం ఎక్కువ మరణాలు కొండ చరియలు విరిగిపడడం (ల్యాండ్ స్లైడ్స్) వల్లే జరిగాయి. గత రెండు రోజుల్లో ఎనిమిది జిల్లాల్లో మొత్తం 80 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు ప్రకటించారు. మలప్పుఱం, కవలప్పర, మెప్పాడి, వాయనాడ్‌లలో ఎక్కువ ఘటనలు జరిగాయి.
ఋతుపవనాలు, వర్షపాతం మారుతుండడంతో కేరళ ప్రజలు బాధలు పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: వందేళ్లలో కనీవినీ ఎరుగని విధ్వంసం
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- కేరళ: ఈ వానా కాలాన్ని దాటేది ఎలా? గత ఏడాది వరదల నుంచి పాఠాలు నేర్చుకుందా?
- కేరళ వరదలు: 26 సెకన్లలో చిన్నారిని కాపాడిన జవాను
- కేరళ వరద బాధితులు: ‘అన్నీ కోల్పోయాం... మళ్లీ గల్ఫ్ దేశాలకు వలస పోతాం’
- కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?
- కేరళ వరదలు: 'ఆ కన్నీళ్ళను ఆపడం నావల్ల కాలేదు...' మూడు జిల్లాల నుంచి బీబీసీ ప్రతినిధుల అనుభవాలు
- కశ్మీర్: "రేపు నా కొడుకు తుపాకీ పడతాడు, భారత్‌పై పోరాడతాడు" - కశ్మీరీ యువకుడి ఆగ్రహం
- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లో నిరసనలు.. అలాంటిదేమీ లేదన్న ప్రభుత్వం
- కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)