వీడియో: '75 శాతం ఉద్యోగాలు స్థానికులకే' నిబంధన ప్రభావం గ్రానైట్ పరిశ్రమపై ఎలా ఉంటుంది
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన 'పరిశ్రమలు, కర్మాగారాల్లో ఉపాధి బిల్లు-2019' పెద్ద చర్చకు తెరలేపింది. రాజకీయవర్గాలతో పాటు నిరుద్యోగులు, కార్మికుల్లోనూ చర్చ సాగుతోంది.
ఇప్పటికే అసెంబ్లీతోపాటు మండలిలోనూ ఆమోదం లభించడంతో ఇక గవర్నర్ రాజముద్ర మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఈ బిల్లు చట్టంగా మారితే తలెత్తే పరిణామాలపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న స్థానికేతర కార్మికుల భవితవ్యంపై బీబీసీ పరిశీలన చేసింది.
బిల్లులో ఏముంది?
తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, జాయింట్ వెంచర్లలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది.
స్థానికతకు మండలం, జిల్లా లేదా రాష్ట్రాన్ని ఆయా పరిస్థితులను బట్టి ప్రమాణికంగా తీసుకుంటారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. అందుకు ఆయా సంస్థలకు ప్రభుత్వం మూడేళ్ల గడువు ఇస్తుంది.
తగిన శిక్షణ పొందిన వారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
అయినా, అమలు నుంచి మినహాయింపు కావాలంటే మాత్రం దానికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- చార్లెస్ డార్విన్కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
- పాకిస్తాన్లో తెరుచుకున్న పురాతన హిందూ ఆలయం.. ‘మిగతా 1100 గుళ్లకు మోక్షం ఎప్పుడు?’
- ఉన్నావ్ రేప్ కేసు: 'ఒక్కొక్కరినీ చంపుకుంటూ వస్తామన్నారు' -బీబీసీతో బాధితురాలి సోదరి
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- 'దీపం' పథకానికి 20 ఏళ్ళు: ఆంధ్రప్రదేశ్ ఇంకా చీకట్లో ఎందుకున్నట్లు...
- Zomato: 'తిండికి మతం లేదు'.. 'మరి హలాల్ మాటేంటీ?'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)