You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: శాండ్‌విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
30-50 ఏళ్ల మధ్య వయసుండి.. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు పిల్లల బాధ్యత కలిగినవారే శాండ్‌విచ్ జనరేషన్ అంటే! ఈ జనరేషన్ వ్యక్తుల జీవితం ఎలా ఉంది? బీబీసీ.. శాండ్‌విచ్ జనరేషన్‌కు చెందిన కొందరు మహిళలను పలకరించింది. ఆఫీస్ పనులు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతల మధ్య నలిగిపోతున్నామని వారు చెబుతున్నారు.
‘‘మీరు చెబుతున్నట్లే, మేం శాండ్‌విచ్ అవుతున్నాం. ఒకవైపు ఆఫీసు, మరోవైపు పిల్లలు, అత్తమామలు. పనులు చక్కబెట్టాలంటే కష్టపడటం మాత్రమే కాదు కదా, వారితో కాస్త సమయం గడపాలి. లేకపోతే వారిని నిర్లక్ష్యం చేస్తున్నామని భావిస్తారు’’ అని 34 ఏళ్ల దీపా జోషి అన్నారు.
హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే ప్రకారం, తల్లిదండ్రులను చూసుకుంటున్నవారిలో 29% మంది, ఆ బాధ్యతలను భారంగా ఫీల్ అవుతున్నారు. దేశంలోని 20 నగరాల్లో ఈ సర్వే చేశారు.
మరి ఇలాంటి బాధ్యతల నడుమ నలిగిపోతున్నామని మహిళలు చెబుతోంటే, పిల్లలు, మహిళల తల్లిదండ్రులు ఏమంటున్నారో, ఆ మహిళల జీవితాలను మూడు కోణాలనుంచి తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- ‘ఈ ఆసుపత్రిలో చేరిన చిన్నారులెవరూ ప్రాణాలతో వెనక్కి వెళ్లట్లేదు’
- కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్ చేసి బయటకు వస్తానన్నాడు.. కానీ...
- వందల ఏళ్ల క్రితమే గంజాయి వాడకం... సమాధుల్లో బయటపడిన సాక్ష్యాలు
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)