జయలలిత ప్రథమ వర్ధంతి: మెరీనా కన్నీరు మున్నీరైన వేళ

ప్రచురణ

‘‘ప్రజలు తప్ప నాకింకెవ్వరూ లేరు..’’ అని జయలలిత తరచూ అనేవారు. మెరీనా బీచ్‌ జనసంద్రంగా మారిన ఆనాటి దృశ్యాలు.

జయలలిత భౌతిక కాయం వద్ద శశికళ
ఫొటో క్యాప్షన్, అభిమానులు, ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతిక కాయాన్ని రాజాజీ హాల్లో ఉంచారు.
రాజాజీ హాల్ వద్ద బారులు తీరిన ప్రజలు
ఫొటో క్యాప్షన్, జయలలితకు అంతిమ వీడ్కోలు తెలిపేందుకు రాజాజీ హాల్ వద్ద బారులు తీరిన ప్రజలు.
జయలలిత భౌతిక కాయం వద్ద ఇన్‌ఛార్జ్ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు
ఫొటో క్యాప్షన్, జయలలితకు నివాళులు అర్పిస్తున్న ఇన్‌ఛార్జ్ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు.
వేలాదిగా గుమిగూడిన ప్రజలు
ఫొటో క్యాప్షన్, ఎ.డి.ఎమ్.కె పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు వేలాది మంది ప్రజలు జయలలితకు అంతిమ వీడ్కోలు పలికిన దృశ్యం
జయలలిత భౌతిక కాయం వద్ద విచార వదనంతో శశికళ, ఇతరులు
ఫొటో క్యాప్షన్, ‘తమిళనాడు ప్రజలు తప్ప నాకింకెవ్వరూ లేరు.. నాకంటూ ఏదీ లేదు’ అని జయలలిత తరచూ భావోద్వేగంతో అనేవారు.
ప్రజలు, వారిని అదుపు చేస్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, జయలలిత మరణం నేపథ్యంలో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
జయలలిత భౌతిక కాయం వద్ద మోదీ, వెంకయ్య నాయుడు, పన్నీర్ సెల్వం తదితరులు
ఫొటో క్యాప్షన్, నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
జయలలిత భౌతిక కాయం చుట్టూ పార్టీ నేతలు.
ఫొటో క్యాప్షన్, జయలలిత భౌతిక కాయం చుట్టూ కూర్చున్న ఎమ్మెల్యేలు, మంత్రులు.
జయలలిత పార్థివ దేహం
ఫొటో క్యాప్షన్, జయలలిత భౌతిక కాయాన్ని రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్‌కు తీసుకెళ్లారు
గౌరవ వందనం చేస్తోన్న ఆర్మీ సిబ్బంది.
ఫొటో క్యాప్షన్, గౌరవ వందనం చేస్తోన్న ఆర్మీ సిబ్బంది.
అంతిమ యాత్రలో ప్రజలు, పోలీసులు
ఫొటో క్యాప్షన్, అంత్యక్రియల్లో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు.
పోలీసులు, ప్రజలు
ఫొటో క్యాప్షన్, మెరీనా బీచ్‌లో జయలలిత స్మారక చిహ్నం.