You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా?
అండమాన్ దీవులు, లక్షదీవుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ సముద్రపు దీవి ఉందని చాలామంది తెలియకపోవచ్చు.
కాకినాడ తీరం నుంచి కనిపించే ఆ దీవిలో నివాసం ఉంటున్న వారి గురించి తెలుసా? బంగాళాఖాతంలోని ఈ దీవిలో నివసించే వారికి ఏ చిన్న సరకు కావాల్సినా పడవ ఎక్కి సముద్రం దాటాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక దీవి- హోప్ ఐలాండ్.కాకినాడ నగరానికి పెట్టని కోటలా మారిన ఈ దీవి విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి.
అన్ని సదుపాయాలకు దూరంగా అక్కడ నివశిస్తున్న వారి జీవితాలు సమస్యలమయంగా కనిపిస్తాయి.
సముద్రంలో ఏర్పడిన అనేక దీవులతో పోలిస్తే ఈ హోప్ ఐలాండ్ వయసు చాలా తక్కువ. గడిచిన 200 ఏళ్లుగా ఇది క్రమంగా విస్తరించింది.
గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ధవళేశ్వరం వద్ద కాటన్ కట్టిన ఆనకట్ట కారణంగా ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధరించారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి:
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
- రేబిస్‌ను రాబందులు ఎలా అడ్డుకుంటాయంటే
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- ‘ది మర్చంట్ ఆఫ్ డెత్’ విక్టర్ బౌట్‌ను అమెరికా ఎందుకు విడుదల చేసింది, అతని చరిత్ర ఏంటి?
- ‘రేసు గుర్రం మద్దాలి శివారెడ్డి’ మీద సోషల్ మీడియాలో విమర్శలెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)