ఎఫ్‌టీఎక్స్ వివాదం ఏమిటి?

ఎఫ్‌టీఎక్స్ వివాదం ఏమిటి?
ప్రచురణ

ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రిస్టో ఎక్స్‌చేంజ్ కంపెనీ ఎఫ్‌టీఎక్స్ వారం రోజుల్లోనే ఘోరంగా పతనమైంది.

క్రిప్టో కింగ్‌గా పిలుచుకునే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ సామ్ బ్యాంక్‌మాన్ ఫ్రీడ్.. సంస్థ సీఈవో పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు ఎఫ్‌టీఎక్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి సంస్థ బియాన్స్ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

బిలియనీర్ అయిన సామ్ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. తమను దివాలా తీసిన సంస్థగా ప్రకటించాలని కోర్టుకు ఎఫ్‌టీఎక్స్ అభ్యర్థన పెట్టుకుంది.

అయితే, ఇప్పుడు సామ్‌తోపాటు మరికొంతమంది విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో నిషాద్ సింగ్ ఒకరు.

రెండో అతి పెద్ద క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ దివాలా తీయడం వెనుక ఆయన ఉన్నారని వార్తలు వస్తున్నాయి.   

అసలు ఈ వివాదం ఏమిటి? దీనిలోకి భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్ ఎలా వచ్చారు? ఆయనపై వస్తున్న ఆరోపణలు ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)