బస్సు డ్రైవర్ అయినందుకు నేను గర్వపడుతున్నా: ప్రియాంక శర్మ
బస్సు డ్రైవర్ అయినందుకు నేను గర్వపడుతున్నా: ప్రియాంక శర్మ
ప్రచురణ
‘‘నేను బస్ డ్రైవర్‌ని. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను అదోలా చూసేవాళ్లు. ఈమె నడపడం ఏంటి... ఇది తప్పు అనే వాళ్లు. కానీ ఒక మహిళగా బస్సు డ్రైవర్ అయినందుకు నేను గర్వపడుతున్నా’’ అంటున్నారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన ప్రియాంక శర్మ.
పింక్ లైన్ సర్వీస్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 26 మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ ఒకరు.
కౌశాంబి బస్ డిపోలో ప్రస్తుతం ఆమె శిక్షణ పొందుతున్నారు.
అనేక కష్టాలు, అవరోధాలు ఎదుర్కొన్న తరువాత ప్రియాంక బస్సు డ్రైవర్ అయ్యారు.
‘‘కష్టపడి పని చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని మహిళలందరికీ చెబుతున్నా’’ అంటున్నారు.




