కుందర్కీ: 60 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 31 ఏళ్ల తరువాత బీజేపీ గెలుపు

ఫొటో సోర్స్, ANI
దేశమంతా మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటుంటే, యూపీ రాజకీయవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఆ ఒక్క సీటు గురించే చర్చ జరుగుతోంది.
1993 తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కూడా గెలవని ఆ సీటు.. మురాదాబాద్ జిల్లాలోని కుందర్కీ నియోజకవర్గం.
31 ఏళ్ల కిందట బీజేపీ కుందర్కీలో గెలిచింది.
అప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్ర విజయ్ సింగ్ ఇక్కడి నుంచి గెలుపొందారు.

ఆ తర్వాత ఇప్పుడు, 2024లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రామ్‌వీర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ రిజ్వాన్‌పై లక్షా 44 వేల 791 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామ్‌వీర్ సింగ్ సుమారు 2 వేల ఓట్ల తేడాతో మొహమ్మద్ రిజ్వాన్ చేతిలో ఓడిపోయారు.

ఫొటో సోర్స్, FACEBOOK/RAMVEER SINGH
11 మంది ముస్లిం అభ్యర్థులు, ఒక్కరే హిందూ
ఈ ఉప ఎన్నికల్లో కుందర్కీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రామ్‌వీర్ సింగ్ ఒక్కరే హిందూ అభ్యర్థి.
ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన మిగిలిన 11 మంది కూడా ముస్లింలు.
సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరాం), ఏఐఎంఐఎం, బహుజన సమాజ్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాయి.
బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ సింగ్‌కు 1,70,371 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ రిజ్వాన్‌కు 25,580 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రామ్‌వీర్ సింగ్, మొహమ్మద్ రిజ్వాన్ మధ్య ఓట్ల తేడా 1,44,791. ఇక మూడో స్థానంలో నిలిచిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అభ్యర్థి చాంద్‌కి 14,201 ఓట్లు వచ్చాయి.
ఏఐఎంఐఎంకు చెందిన మొహమ్మద్ వారిస్‌కు 8,111, బీఎస్పీ నుంచి పోటీ చేసిన రఫతుల్లాకు 1,099 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింల ప్రాబల్యమున్న సీటులో బీజేపీ ఎలా?
2022లో జరిగిన ఎన్నికల్లో కుందర్కీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జియా ఉర్ రహమాన్ బర్క్ బీజేపీ అభ్యర్థి కమల్ కుమార్‌పై విజయం సాధించారు. ఈయన సమాజ్‌వాదీ సీనియర్ నేత, మాజీ ఎంపీ షఫీక్ ఉర్ రహమాన్ మనవడు.
2024లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో జియా ఉర్ రహమాన్ సంభాల్ పార్లమెంట్ నియోజకర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో కుందర్కీ సీటు ఖాళీ అయింది.
దాదాపు 60 శాతం ఓట్లతో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ఇలాంటి స్థానంలో బీజేపీ విజయం సాధించడాన్ని పెద్ద విషయంగానే రాజకీయవర్గాలు పరిగణిస్తున్నాయి.
యూపీలో ఉప ఎన్నికలు జరిగిన 9 స్థానాల్లో కుందర్కీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇక్కడ ప్రచారానికి రావడానికి కారణం కూడా ఇదే.
రామ్‌వీర్ వ్యూహం కూడా సగటు బీజేపీ అభ్యర్థికి భిన్నంగా కనిపించింది.
రామ్‌వీర్ సింగ్ ముస్లిం ప్రాంతాలకు వెళ్లి బీజేపీకి ఓట్లు అడిగారు.
అప్పుడప్పుడూ ముస్లింల టోపీ ధరించి కనిపించారు. ముస్లింలతో మాట్లాడేప్పుడు ఉర్దూ, అరబిక్ పదాలను వాడేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, పోలింగ్ రోజున రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఎస్పీ అభ్యర్థి మొహమ్మద్ రిజ్వాన్ ఆరోపణలు చేశారు. కుందర్కీలో పోటీ చేస్తోంది బీజేపీ కాదని, పోలీసులే పోటీ చేస్తున్నట్లు ఉందని రిజ్వాన్ అన్నారు. సమాజ్‌వాదీ అనుకూల ఓటర్లను అడ్డుకున్నారు, చాలా బూత్‌లలోకి మా ఏజెంట్లను కూడా రానీయలేదని ఆయన ఆరోపించారు.
పోలింగ్ రోజు రిజ్వాన్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అయితే, ఓడిపోతామన్న భయంతోనే ఎస్పీ అభ్యర్థి రిజ్వాన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ సింగ్ అన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. మీరాపూర్, కుందర్కీ, ఘాజియాబాద్. ఖైర్, కర్హల్, సీసామవూ, ఫుల్‌పూర్, కటెహరీ, మఝవాన్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు.
వీటిలో బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు కర్హల్, సీసామవూలో గెలుపొందింది. మీరాపూర్‌లో ఆర్‌ఎల్డీ అభ్యర్థి గెలుపొందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































