మంచులో రాకెట్‌లా దూసుకుపోయే అమ్మాయి

మంచులో రాకెట్‌లా దూసుకుపోయే అమ్మాయి
ప్రచురణ

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ ప్రాంతానికి చెందిన ఆంచల్ ఠాకుర్ అల్పైన్ స్కీయింగ్‌లో రాణిస్తున్నారు.

ఇటీవల జరిగిన టోర్నీల్లో భారత్‌కు నాలుగు ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్స్ సాధించి పెట్టిన ఈ యువతి... వింటర్ ఒలింపిక్స్‌లో పతకాన్ని గెల్చుకోవడం తన లక్ష్యం అంటున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆంచల్ ఠాకుర్... స్కీయింగ్‌లో దేశానికి పేరు తెస్తున్నారు. ఆమె భారత్‌లో మొట్టమొదటి మహిళా అల్పైన్ స్కీ. ఆమె దుబయ్‌లో జరిగిన International Alpine Ski Championship -2022లో నాలుగు సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నారు.

మనాలీలో బరువా అనే ఓ చిన్న గ్రామంలో అల్పైన్ స్కీయర్ ఆటకు ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ దాదాపు 200 మంది ప్లేయర్లు ఈ స్పోర్ట్‌లో సాధన చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇద్దరు ప్లేయర్లు వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. తనకు ఐదేళ్లున్నప్పుడు తన తండ్రి, తాతల ప్రోత్సాహంతో ఈ ఆటను నేర్చుకోవడం మొదలుపెట్టానని ఆంచల్ ఠాకుర్ అన్నారు.

పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)