You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చెడ్డీ గ్యాంగ్: ఒంటికి నూనె రాసుకుని వస్తారు, చేతికి చిక్కకుండా జారుకుంటారు.
ఎండాకాలం వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా దొంగతనాలు ఎక్కువవుతాయి. వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేవారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్ లాంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చెలరేగిపోతాయని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.
ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే గతంలో తిరుచానూరు, చిగురువాడ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తుచేసుకుంటున్నారు.
వేసవి వచ్చేయడం, దొంగల ముఠాల కదలికలు కూడా కనిపించడంతో ప్రజలను అప్రమత్తం చేసి, వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి జిల్లా పోలీసులు.
ఈ గ్యాంగ్స్ ఎలా పనిచేస్తాయి? ఎలా దొంగతనాలు చేస్తాయి? అన్నది వివరించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఆ దొంగలను ఎలా గుర్తు పట్టవచ్చు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎలా కాపాడుకోవచ్చో కూడా బీబీసీకి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- లక్షలాదిగా ఆక్టోపస్--ల సాగుకు ప్రణాళిక.. బీబీసీకి లభించిన రహస్య పత్రాలు ఏం చెప్తున్నాయి-
- వానరాలకు ఉన్నట్లుగా మన దేహమంతటా దట్టమైన జుత్తు ఎందుకు లేదు- ఈ మానవ పరిణామానికి, సెక్స్-కు సంబంధం ఏమిటి-
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్ - BBC News తెలుగు
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- - BBC News తెలుగు
- ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి- - BBC News తెలుగు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)