You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ పోరు బీజేపీతోనేనా... ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి?
కేసిఆర్ మళ్లీ థర్డ్ ఫ్రంట్ బాట పట్టారు. థర్డ్ ఫ్రంట్ అంటారా గతంలో మాదిరి ఫెడరల్ ఫ్రంట్ అంటారా? పేరు ఏదైనా కానీ డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్లో వివిధ సెక్యులర్ పార్టీల జాతీయ పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నట్టు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పార్టీకి పథ నిర్దేశం చేసే సమావేశంలో ఆయన వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారు.
గతంలోకూడా ఆయన కూడా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో ఫలితాలు ఏ పార్టీకి ఆధిక్యం ఇవ్వని పక్షంలో చిన్న పార్టీలు కీలకపాత్ర పోషించే పక్షంలో చక్రం తిప్పుదామని భావించారు.
అయితే, అంచనాలను మించి బిజపి తనకు తానుగా మెజారిటీ సీట్లు గెల్చుకోవడంతో ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సారి మళ్లీ ఆ ప్రయత్నాలు ఈ రకంగా మొదలెట్టారు అని అర్థం అవుతుంది. ఇతర పార్టీల నాయకులు కలిసి వస్తారా రారా, వస్తే ఏ ప్రాతిపదికన కలిసి వస్తారు వారి ఆశల సంగతేంటి, ఇదెంత వరకు సాధ్యం అనేది వేరే చర్చ.ఏమైనా, జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాల్లో కేసీఆర్ ఈ కీలక ప్రకటన చేయడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కాకుండా బీజేపీని ఎక్కుపెట్టి విమర్శలు చేయడం ఇందులో గమనించాల్సిన విషయం అంటూ బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ అందిస్తున్న విశ్లేషణ.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)