విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి పంపడం ఎలా?
ఏదైనా నౌక ప్రమాదవశాత్తూ తీరం దగ్గర నేలని తాకితే దాన్ని రన్ ఏ గ్రౌండ్ (run a ground) అంటారు. ఇలాంటి నౌకలను తిరిగి సముద్రం లోపలకి పంపడం చాలా కష్టం. నీటిలోకి పంపడం ఆలస్యం అవుతున్న కొద్దీ పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.
వాయుగుండం ప్రభావానికి బంగ్లాదేశ్‌కు చెందిన 'ఎంవీ మా' నౌక అవుటర్ హార్బర్ నుంచి తెన్నేటి పార్క్ బీచ్‌కు కొట్టుకొచ్చింది.
ఆ నౌక యాజమాన్యం దీన్ని తిరిగి సముద్రం లోపలికి తీసుకెళ్లే పనిని రెండు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో ఎంఎస్ గిల్ మెరైన్ సంస్థ... నౌకలో ఉన్న దాదాపు 50 టన్నుల చమురును సురక్షితంగా బయటకు తీసే పనిలో ఉంది.
మరో సంస్థ... ఫ్లాగ్ షిప్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ చమురును తీసేసిన తర్వాత నౌకను సముద్రం లోపలికి పంపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల అధీనంలోనే 'ఎంవీ మా' నౌక ఉంది. వీరికి పోర్టు, మెరైన్, కోస్టు గార్డు, స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్ని రోజుల్లోగా ఈ నౌకను తిరిగి సముద్రంలోకి పంపగలమన్న విషయాన్ని నిపుణుల బృందం నిర్ధారిస్తుందని మెరైన్ డీఎస్పీ విమల కుమారి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్‌కి చైనాలో బ్యాంకు అకౌంట్ ఉంది: న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
- ‘పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేశారు’: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
- ప్రైవేటు కంపెనీలకు చోటివ్వకుండా భారత రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భరత’ సాధ్యమేనా?
- డీప్ ఫేక్ టెక్నాలజీ: లక్షకు పైగా మహిళల సోషల్ మీడియా ఫొటోలను నగ్నంగా మార్చేశారు..
- విజయవాడకు వరద ముప్పు తొలిగే మార్గం లేదా? ఎందుకు ఈ పరిస్థితి?
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)