కృత్రిమ గుండెతో చిన్నారిని కాపాడిన చెన్నై డాక్టర్లు
ప్రచురణ
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ పద్ధతి ద్వారా ఓ మూడేళ్ల చిన్నారిని ప్రాణాపాయం నుండి కాపాడగలిగారు.
శరీరం లోపల కాకుండా, బయటనే ఓ ఆర్టిఫిషియల్ గుండెను అమర్చి ఆ చిన్నారిని రక్షించారు. లెవ్ ఫెడ్రెన్కో అనే ఈ బాలుని గుండెలోని సిరలు రెండూ ఉబ్బుతూ ఉండటంతో శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రసరణ కష్టంగా మారింది. రష్యా నుంచి చికిత్స కోసం ఇక్కడికి వచ్చిన ఈ చిన్నారికి రెండు నెలలుగా చెన్నైలోని MGM లో వైద్యం అందిస్తున్నారు.
అయితే, చికిత్స చేస్తున్న సమయంలోనే లెవ్‌కు రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో సరిగా పని చేయని రెండు సిరలకు బదులుగా బయట నుంచే ఆర్టిఫిషియల్ పంప్లను ఏర్పాటు చేశారు వైద్యులు.
ఇవి కూడా చదవండి:
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..!
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
- కరోనావైరస్ మృతులను జేసీబీలతో ఎందుకు ఖననం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)