కరోనావైరస్: వీడియో చాట్స్, ఫోన్ సెక్స్.... ఇకపై లైఫ్ ఇంతేనా?
లాక్‌డౌన్ సమయంలో వీడియో డేట్‌లు విపరీతంగా పెరిగాయని ఇ-హార్మొనీ, ఒకేక్యూపిడ్, మ్యాచ్ లాంటి డేటింగ్ యాప్స్ చెబుతున్నాయి.
లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రేమికుల్ని ఆకట్టుకొనేందుకు రెస్టారెంట్లు, కెఫెలు కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నాయి. డేట్ నైట్లు కూడా త్వరలో తిరిగి రాబోతున్నాయి. అయితే సామాజిక దూరంతోపాటు గాజు అద్దాలతో అడ్డుగోడలు కొన్నిసార్లు తప్పనిసరి కావొచ్చు.
ఇప్పుడు వీడియో చాట్‌లు సర్వ సాధారణం అయిపోయాయి. ఫోన్ సెక్స్ కూడా..
రెస్టారెంట్లు మూసివేయడంతో డేట్స్ సాధ్యపడటం లేదు. అయితే పెళ్లిళ్లు, డేట్స్, సెక్స్.. ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. ఇది చాలా భయానకమైన భవిష్యత్తు. కానీ ప్రతిదాంట్లోనూ మార్పు సహజం.
ఇప్పుడు బెంగళూరులోని బాల్కనీలో కొవ్వొత్తి వెలుగుల నడుమ ఓ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఎదురుచూస్తున్నాడు కేలెబ్. ఈ ఎదురుచూపులు ఎవరో వస్తారని కాదు. తన బంబుల్ యాప్‌లో ప్రేయసి కోసం.
కేలెబ్ ఇదివరకు కూడా డేటింగ్ యాప్స్‌పై చాలా సమయం వెచ్చించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ సేపు వాటితోనే గడుపుతున్నారు. అప్పట్లో తన స్టార్టప్ కంపెనీపై చాలా సమయం వెచ్చించేవారు. కానీ లాక్‌డౌన్‌తో అన్ని మూతపడ్డాయి. దీంతో ఇప్పుడు ఆయన తోడు కోసం డేటింగ్ యాప్‌ల వెంట పడుతున్నారు. చివరకు ఆయన విజయం సాధించారు కూడా.
మొదట్లో కేవలం పింగ్‌లు, చాట్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సుదీర్ఘ సంభాషణలూ మొదలయ్యాయి. చివరగా డేట్. అదే ఇప్పుడు జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- జగన్ ఏడాది పాలనలో టీడీపీ నేతలు ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఆ కేసులు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)