You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా విషయంలో మోదీ, అమిత్ షాలు ఇబ్బంది పడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు రెండు వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటి సవాలు చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం కాగా, రెండోది రాజకీయపరమైనది.
చైనాతో మోదీ ప్రభుత్వం అనురిస్తున్న తీరును ప్రతిపక్షం నిత్యం విమర్శిస్తూనే ఉంది. తన సందేహాలకు సమాధానాలు కోరుతూనే ఉంది.
గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. పైగా అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనల్లో సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు చైనాలో భారత రాయబారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
''రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా తన దళాలను తిరిగి ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వైపు నడిపిస్తుందని ఇండియా ఆశావహంగా ఉంది'' అని చైనాలో భారత రాయబారి వ్యాఖ్యానించినట్లు పీటీఐ పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ అంతకు ముందు చేసిన ప్రకటనకు, భారత రాయబారి ప్రకటన పూర్తిగా భిన్నంగా ఉంది. మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, ఏ పోస్ట్‌ను ఆక్రమించలేదని జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి' - చైనాలో భారత యుద్ధ ఖైదీ
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)