You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ చైనాలోని వూహాన్‌లో డిసెంబర్ కన్నా ముందే బయటపడిందా... శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి?
చైనాలోని వూహాన్ నగరంలో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఆస్పత్రుల వద్ద భారీగా ట్రాఫిక్ పెరిగినట్టు ఉపగ్రహ ఛాయ చిత్రాల ద్వారా స్పష్టమవుతోందని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.
అదే సమయంలో దగ్గు, డయేరియా లక్షణాలకు సంబంధించి జనం ఆన్ లైన్లో వెతకడం కూడా ఒక్కసారిగా పెరిగింది.
అయితే చైనా మాత్రం ఏ మాత్రం సారం లేని సమాచారంతో చేసిన అర్థం లేని పరిశోధన అంటూ దీన్ని కొట్టి పారేసింది.
తొలిసారిగా నవంబర్లోనే వైరస్ ఉనికి తెలిసిందని మరోసారి స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 31న ఒక్కసారిగా న్యూమోనియా కేసులు పెరిగాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధికారవర్గాలు సమాచారాన్ని ఇచ్చాయి. కారణాలేంటన్నది తెలియడం లేదని అందులో పేర్కొన్నాయి.
ఈ పరిశోధన ఏం చెబుతోంది?
పరిశోధకులు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వూహాన్లోని ఆస్పత్రుల పరిసర ప్రాంతాలను గమనించారు. 2018లో ఆగస్టు తరువాత అలాగే 2019 ఆగస్టు నెల తర్వాత ఆస్పత్రుల వద్ద పరిస్థితుల్ని అధ్యయనం చేశారు.
2018 అక్టోబర్‌లో వూహాన్లోని అతి పెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన టయాన్‌యు ఆస్పత్రి వద్ద 171కార్లు నిలిపి ఉన్నాయి.
అదే ఆస్పత్రి వద్ద 2019 అక్టోబర్ శాటిలైట్ డేటాను పరిశీలించగా నిలిపి ఉన్న కార్ల సంఖ్య 285కి చేరింది. అంటే దాదాపు 67 శాతం పెరిగాయన్నమాట.
అదే సమయంలో చైనా సెర్చింజన్ బైదులో కరోనావైరస్ లక్షణాలతో సంబంధం ఉన్న పదాలతో సెర్చ్ చేయడం అనుహ్యంగా పెరిగింది.
"ఇదంతా ఆ సమయంలో వూహాన్లో ఏదో జరిగిందనడానికి చెప్పడానికి సంబంధించిన సమాచారం" అని డాక్టర్ బ్రౌనిస్టీన్ ఏబీసీకి చెప్పారు.
అయితే మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చైనా విదేశా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఈ పరిశోధనను కొట్టి పారేశారు.
"ఇదో హాస్యాస్పదమైన పరిశోధన. పెరిగిన ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావడంలో అర్థం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత?
- పీజీలూ, పీహెచ్‌డీలూ, టీచర్లూ, లెక్చరర్లనూ ఉపాధి హామీ కూలీలుగా మార్చేసిన కరోనా మహమ్మారి
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనా లాక్డౌన్: కష్టకాలంలో డిజిటల్ వైపు మళ్లి, లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు
- ఆరు వసంతాల తెలంగాణ: ఉద్యమం నాటి ఆశలు, ఆకాంక్షలు ఎంతవరకూ నెరవేరాయి?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- లాక్ డౌన్‌తో దేశంలో ఆకలి చావులు పెరుగుతాయి: 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)